సుశాంత్ ” చి||ల||సౌ|| ” రివ్యూ & రేటింగ్

9

అక్కినేని ఫ్యామిలీ బ్రాక్ గ్రౌండ్ ఉన్నా హీరోగా ఇప్పటికి ఓ ఇమేజ్ తెచ్చుకోలేని సుశాంత్ కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని చేస్తున్న ప్రయత్నం చిలసౌ. ఈ సినిమా దర్శకుడు రాహుల్ రవింద్రన్ ఓ హీరో అవడం వల్ల సినిమాపై ఆసక్తి పెతిగింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ప్రేమలో విఫలమైన అర్జున్ (సుశాంత్) ఇంట్లో వాళ్లు పెళ్లి పెళ్లి అని గోల చేస్తుంటే పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ అంజలి (రుహాని శర్మ)ను చూస్తాడు. అంజలి కూడా ఇదవరకు చాలామందిని రిజెక్ట్ చేస్తుంది. అంజలి తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఈఆరి పెళ్లిచూపులు సక్సెస్ చేసుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో అంజలిని చూడగానే నచ్చలేదని చెబుతాడు అర్జున్. అయితే వారిద్దరు ఒక రోజు మొత్తం కలిసి ఉండాల్సి వస్తుంది. అప్పుడు అర్జున్ ఆలోచనలు మారుతాయి. ఇంతకీ అర్జున్, అంజలిల తర్వాత కథ ఏమైంది అన్నదే మిగతా సినిమ.

నటీనటుల ప్రతిభ :

సుశాంత్ ఈ సినిమాలో కాస్త సెటిల్డ్ గా బాగా చేశాడు. ఎంచుకున్న పాత్ర దాని స్వభావంతో అలరించాడు. ఇక సినిమాలో రుహాని శర్మ ముందు చూడగానే బాగాలేదనిపించినా తర్వాత తర్వాత ఆమె నటనతో అందరిని మెప్పిస్తుంది. వెన్నెల కిశోర్ కామెడీ అలరించింది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

ప్రశాంత్ విహారి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవగా ఎన్.సుకుమార్ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. దర్శకుడిగా మొదటి సినిమానే అయినా రాహుల్ గొప్ప పరిణితితో సినిమా చేశాడని చెప్పొచ్చు. కథ, కథనాల్లో తన ప్రతిభ కనబరిచాడు. సినిమా అంతా హాయిగా సాగడం ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ ఇంప్రెస్ చేశాయి.

విశ్లేషణ :

అక్కినేని హీరోగా సుశాంత్ చేసిన చిలసౌ సినిమా టీజర్ తోనే ఇంప్రెస్ చేసింది. రాహుల్ రవింద్రన్ ఈ సినిమాను చాలా క్లవర్ గా డీల్ చేశాడు. కథ, కథనాలు కొత్తగా అని చెప్పలేం కాని ఎలాంటి బోర్ లేకుండా తీశాడు. సినిమా అంతా కూల్ గా సాగుతుంది. దర్శకుడు అక్కడక్కడ తన పనితనం చూపించాడు.

మొదటి భాగం, రెండో భాగం మెలో డ్రామా కలిపి చూపించారు. అయితే సినిమా ఎక్కడ నాటకీయంగా అనిపించదు. ఇది తప్పకుండా సిన్సియర్ ఎఫర్ట్ అని చెప్పొచ్చు. లీడ్ పెయిర్ మీదే సినిమా ఎక్కువ భాగం నడుస్తుంది. దానికి వారు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశారు.

సుశాంత్ ను హీరోగా నిలబెట్టే క్రమంలో చిలసౌ సినిమా అతని కెరియర్ లో సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. యూత్ ఆడియెన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చేస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

లీడ్ పెయిర్

స్క్రీన్ ప్లే

డైరక్షన్

మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ కమర్షియల్ ఎలిమినెట్స్

బాటం లైన్ :

సుశాంత్ ను నిలబెట్టిన చిలసౌ..!

రేటింగ్ : 3.5/5

Leave a comment