Gossipsహోల్ సేల్ గ చెర్రీ కి టెండర్..!

హోల్ సేల్ గ చెర్రీ కి టెండర్..!

రంగస్థలం సినిమాతో చరణ్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా చరణ్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా రికార్డ్ సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డులను తన పేరు మీద రాసుకున్న రాం చరణ్ ఈసారి కూడా అదే రేంజ్ రికార్డుల మీద కన్నేశాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు చరణ్.

ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతుంది. రంగస్థలం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే జోష్ కనబరుస్తుంది. బోయపాటి శ్రీను, చరణ్ సినిమా యువి క్రియేషన్స్ వారు భారీ రేటుకి కొనేశారట. రంగస్థలం నైజాం హక్కులను పొంది భారీ లాభాలను పొందిన యువి క్రియేషన్స్ ఈసారి చరణ్ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ పై కన్నేసింది.

ఆంధ్రాలో మంచి పట్టున్న యువి క్రియేషన్స్ వారు చరణ్ సినిమా మొత్తగా మాట్లాడుతున్నారట. డివివి దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా 75 కోట్లకు కోట్ చేశారట. నిర్మాత దాదాపు కన్విన్స్ అయ్యాడని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో భరత్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news