శ్రద్ధా కపూర్ పై చీటింగ్ కేసు.. నిర్మాతలని వదల్లేదు..!

cheeting case on sahoo heroien

హ‌సీనా పార్క‌ర్ నిర్మాతలు మీద హీరోయిన్ శ్రద్ధా కపూర్ పై ఓ బడా వస్త్ర దుకాణం కేసులు పెట్టింది. ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో త‌మ వ‌స్త్రాల బ్రాండ్‌ ను ప్ర‌చారం చేయ‌డం లేదని ఆరోపించింది. అంతేకాదు.. వీరిపై చీటింగ్, క్రిమినల్ కేసులు కూడా పెట్టింది. దీంతో నిర్మాతలు తలపట్టుకుంటున్నారట.

వాస్తవానికి ఈ సినిమాకు ‘ఎం అండ్ ఎం’ అనే వస్త్రాలయం దుస్తులను పంపిణీ చేసింది. అయితే దీనికిగాను సదరు సంస్థ నిర్మాతలతో ఓ ఒప్పందం చేసుకుంది. హీరోయిన్ శ్రద్దా కపూర్ గాని, ఇతర సినిమా సభ్యులు గాని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఈ సంస్థ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలి. ఎం అండ్ ఎం బ్రాండ్ అయిన ‘ఏజేటీఎమ్ – ఏజే మిస్త్రీ అండ్ థియా మిన్హాస్‌’ కు ప్రచారం కల్పించాల్సి ఉందట.

అయితే ఇవేమీ చిత్ర యూనిట్ పట్టించుకోవడం లేదట. పలుమార్లు అడిగిన తర్వాత లాభం లేదని భావించారో ఏమోగాని కంప్లైంట్ వరకు వెళ్ళింది. ప్ర‌చారంలో భాగంగా త‌మ బ్రాండ్‌ను ప్ర‌చారం చేస్తామ‌ని సినిమా నిర్మాత‌లు పేర్కొన్న‌ట్లుగా వ‌స్త్రాల త‌యారీ సంస్థ ఎమ్ అండ్ ఎమ్ డిజైన్స్ త‌ర‌పు న్యాయ‌వాది రిజ్వాన్ సిద్ధిఖీ తెలిపారు.

కాని సినిమా ప్ర‌చారంలో తమ బ్రాండ్ ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం లేద‌న్నారు. అందువల్లే క్రిమిన‌ల్ కేసు పెట్టామన్నారు. అక్టోబ‌ర్ 26న ఈ కేసుకు సంబంధించిన విచార‌ణ జ‌ర‌గనుంది. అయితే ఈ అంశంలో చిత్ర నిర్మాతలు గాని శ్రద్ధా కపూర్ గాని స్పందించలేదు.  దావూద్ ఇబ్ర‌హీం సోద‌రి లైఫ్ హిస్టరీ ఆధారంగా ‘హ‌సీనా పార్క‌ర్‌’ మూవీని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 22న రిలీజ్ కానుంది.

Leave a comment