Gossipsచరణ్ వేస్తున్న మెగా 'పవర్' ప్లాన్..!

చరణ్ వేస్తున్న మెగా ‘పవర్’ ప్లాన్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ కు పవర్ స్టార్ పవన్ అంటే ఎంత అభిమానమో అందరికి తెలిసిందే. పవన్ ఎలాంటి స్టెప్ తీసుకున్నా తన సపోర్ట్ అందించే చరణ్ లేటెస్ట్ గా పవన్ రాజకీయ యాత్రకు తన సపోర్ట్ అందించాడు. అంతేకాదు జై జనసేన అనే నినాదం కూడా పలికించాడు. ఓ పక్క పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెబుతున్న సందర్భంలో మెగా పవర్ స్టార్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను మచ్చిక వ్హేసుకుంటున్నాడు.
ఇక మరో పక్క వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ లు కూడా పవన్ పొలిటికల్ టూర్ పై ట్వీట్ చేశారు. ఇక ఎటొచ్చి అల్లు అర్జున్ మాత్రమే ఇంకా నోరు విప్పలేదు. అసలే చెప్పను బ్రదర్ ఎపిసోడ్ నుండి పవర్ స్టార్ ఫ్యాన్స్ బన్ని మీద్ గుర్రుగా ఉన్నారు. ఆ విషయం తెలిసి కూడా బన్ని పవన్ పొలిటికల్ టూర్ పై ఎలాంటి స్పందన తెలపకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.
ఇదోరకంగా బన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ కు మరింత దూరం అయ్యేలా చేస్తుండగా.. చరణ్ కు మాత్రం మరి కాస్త క్రేజ్ వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో రంగషలం సినిమా చేస్తున్న చరణ్ మార్చి 30న సినిమా రిలీజ్ చేయబోతున్నారు. మరి తర్వాత పవర్ స్టార్ గా మెగా ఫ్యామిలీలో ఎవరు ముందుకొస్తారో చూడాలి.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news