రాజమౌళి పై రాం చరణ్ ఫ్యాన్స్ ఫైర్..!

117

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై మెగా ఫ్యాన్స్ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రాం చరణ్ సీతారామరాజుగా నటిస్తుండగా.. ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ పూణె పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. అయితే ఈరోజు మెగా పవర్ స్టార్ రాం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ నుండి పోస్టర్ వస్తుందని ఆశపడ్డారు మెగా ఫ్యాన్స్.

కాని ప్రెస్ మీట్ లో రివీల్ చేసిన ఫోటోకే హ్యాపీ బర్త్ డే రాం చరణ్ అని ఆర్.ఆర్.ఆర్ టీం రిలీజ్ చేశారు. అది కాకుండా మరేదైనా ఫోటో పెడితే బాగుండేదని మెగా ఫ్యాన్స్ ఆలోచన. తమ హీరో బర్త్ డేకి ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని భావించిన మెగా ఫ్యాన్స్ రాజమౌళి మీద ఫైర్ అవుతున్నారు. సినిమా గురించి ఎంత తెలియకూడదు అనుకున్నా కనీసం ఇలా బర్త్ డేలకు పోస్టర్ వదలకపోవడం ఏం బాగాలేదని అంటున్నారు.

ఇక రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రాం చరణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నూతన దర్శకుడితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. రంగస్థలం సినిమాతో నటుడిగా రాం చరణ్ మరో మెట్టు ఎదిగాడు. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రాం చరణ్ మెగా వారసుడిగా పేరు నిలబెట్టుకున్నాడు.

Leave a comment