Moviesరికార్డు స్థాయిలో చలో శాటిలైట్ రైట్స్..! ఎంతో తెలుసా..?

రికార్డు స్థాయిలో చలో శాటిలైట్ రైట్స్..! ఎంతో తెలుసా..?

యువ హీరో నాగ శౌర్య రశ్మిక హీరోయిన్ గా వస్తున్న సినిమా ఛలో. వెంకీ కుదుముల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నాగ శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకే సినిమా శాటిలైట్ రైట్స్ నాగ శౌర్య రేంజ్ కు భారీగా వెళ్లాయి.

జెమిని టివి ఛలో సినిమా శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుందట. 2.52 కోట్ల రూపాయలతో జెమిని ఛలో రైట్స్ దక్కించుకుంది. ఉంటే 2.50 ఉండాలి లేదా 2.55 ఉండాలి మధ్యలో ఈ 2.52 ఏంటి అంటే టోటల్ నెంబర్స్ యాడ్ చేస్తే 9 రావాలని శంకర్ ప్రసాద్ ఇలా 2 లక్షలు ఎక్కువ అడిగారట. ఇక ఈ సినిమాతో నాగ శౌర్యకు సరికొత్త ఇమేజ్ రావడం కన్ఫాం అంటున్నారు.

నాగ శౌర్య కెరియర్ లోనే హయ్యెస్ట్ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ఈ ఛలో మూవీ అతనికి కమర్షియల్ గా కూడా సక్సెస్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. సినిమా ట్రైలర్ తోనే ఈ రేంజ్ శాటిలైట్ బిజినెస్ చేశాడంటే సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీగానే అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు నాగ శౌర్య.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news