Moviesనితిన్ " ఛల్ మోహన్ రంగ " రివ్యూ & రేటింగ్

నితిన్ ” ఛల్ మోహన్ రంగ ” రివ్యూ & రేటింగ్

అఆ తర్వాత నితిన్ చేసిన లై నిరాశపరచగా త్రివిక్రం కథతో కృష్ణ చైతన్య డైరక్షన్ లో వస్తున్న సినిమా ఛల్ మోహన్ రంగ. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవడం సినిమాకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. నితిన్ సరసన మేఘా ఆకాష్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూసేద్దాం.

కథ :

యూఎస్ వెళ్లడమే గోల్ గా పెట్టుకున్న మోహన్ రంగ (నితిన్) ఎలాగోలా వీసా సంపాదించి యూఎస్ వెళ్తాడు. అక్కడ మేఘా (మేఘా ఆకాష్) తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మరుతుంది. అనూహ్యంగా ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది. కొన్ని కారణాలు వీరిద్దరిని విడగొడతాయి. మేఘా ఇండియాకు వస్తుంది. ఆమెను వెతుక్కుంటూ మోహన్ రంగ కూడా ఇండియాకు వస్తాడు. అసలు మోహన్ రంగ, మేఘా విడిపోడానికి కారణాలు ఏంటి..? వారిద్దరు ప్రేమించుకున్నారా లేదా..? సినిమా కథ ఎటెళ్లింది అన్నది తెర మీద చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ :

లవర్ బోయ్ గా నితిన్ మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ చూపించాడు. త్రివిక్రం డైలాగ్స్ కు నితిన్ నటన మెప్పించింది. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ మోడ్ లోనే తీసుకెళ్లారు. సినిమా మొత్తం నితిన్ భుజాన వేసుకుని నడిపించాడు. హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా మెప్పించింది. లైతో నిరాశ పరచినా ఈ సినిమా అమ్మడికి క్రేజ్ తెచ్చిపెడుతుంది. రావు రమేష్ ఎప్పటిలానే మంచి పాత్ర చేశారు. మధునందన్, ప్రభాస్ శ్రీను, సత్య తమ పాత్రలతో కామెడీ పండించారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమా ఎక్కువ భాగం యూఎస్ లో షూటింగ్ జరుపుకుంది కనుక సినిమాటోగ్రఫీ నటరాజన్ సుబ్రమణ్యం కెమెరా వర్క్ బాగుంది. ఫస్ట్ క్లాస్ టేకింగ్ తో సినిమా వచ్చింది. తమన్ మ్యూజిక్ సినిమాకు మరో అసెట్ గా నిలుస్తుంది. ఎడిటింగ్ ఓకే. కొత్త దర్శకుడే అయినా కృష్ణ చైతన్య సినిమాతో ప్రతిభ కనబరిచాడు. త్రివిక్రం కథలో కొత్తదనం లేకున్నా స్క్రీన్ ప్లేతో సినిమా నడిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

త్రివిక్రం కథతో వచ్చిన ఛల్ మోహన్ రంగ కథ అంత గొప్పగా లేకున్నా సరే కథనంతో మ్యాజిక్ చేశారు. కథ చెప్పే విధానంలో దర్శకుడు ఎంచుకున్న ఎంటర్టైనింగ్ పార్ట్ బాగుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అలరించేలా పవన్, చిరు స్పూఫ్ లు ఆకట్టుకున్నాయి. క్యారక్టరైజేషన్ పరంగా పర్వాలేదు.

లై సినిమాలో కన్నా నితిన్, మేఘా ఆకాష్ మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగా వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. యూత్ ను ఆకట్టుకునే సీన్స్ బాగా రాసుకున్నాడు దర్శకుడు. రొమాంటిక్ పైర్ గా స్క్రీన్ పై నితిన్, మేఘా జంట అలరిస్తుంది. సినిమాలో కొన్ని సర్ ప్రైజెస్ ఉన్నాయి.

సినిమా మొదటి భాగం మొత్తం ఫారిన్ లో షూట్ చేయగా.. సెకండ్ హాఫ్ మన దగ్గర నడుస్తుంది. సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ మోడ్ లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాను బాగా లేపాయి. సినిమా 148 నిమిషాల రన్ టైం కాబట్టి సినిమా అలరించింది. నితిన్ అకౌంట్ ఛల్ మోహన్ రంగ మంచి ఫలితం ఇస్తుందని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

నితిన్, మేఘా ఆకాష్ జోడి

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

అక్కడక్కడ ల్యాగ్ అవడం

బాటం లైన్ : నితిన్ ఛల్ మోహన్ రంగ.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్..!

రేటింగ్ : 3/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news