Gossips"నాగ్ నా తండ్రి కాదు" చైతు ఫ్యూజులు...

“నాగ్ నా తండ్రి కాదు” చైతు ఫ్యూజులు ఎగిరిపోయే ఆన్సర్..!

ఆర్జివి డైరక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా చేసిన సినిమా ఆఫీసర్. జూన్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో నాగ చైతన్య కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. నాగార్జున తనకు తండ్రి కాదని చెప్పడం షాకింగ్ గా మారింది.

ఏజ్ పరంగా తన తండ్రి తమకు అన్నలా కనిపిస్తాడనే ఉద్దేశంతో నాగ చైతన్య అలా మాట్లాడాడు. ఇక ఆఫీసర్ మరో శివ అవుతుందని.. శివ టైంలో అది అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇది కూడా ఊహించని రేంజ్ లో హిట్ అవుతుందని అన్నాడు నాగ చైతన్య. తన తండ్రి గురించి చెప్పమని అడిగిన యాంకర్ ప్రశ్నకు సమాధానం గా నాగార్జున తన తండ్రి కాదు అన్నయ్య అనేశాడు.

ఇక అఖిల్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. 25 ఏళ్ల క్రితం శివ కోసం తన తండ్రి పడిన కష్టం కంటే ఆఫీసర్ కు ఇంకా ఎక్కువ కష్టపడ్డారని.. ఆయన సిన్సియర్ నెస్ చూసి నిజమైన పోలీసులు ఇలానే ఉంటారని మాకు స్పూర్తి కలిగిందని అన్నారు అఖిల్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news