ప్రియా వారియర్ పై కేసు.. ముందే జాగ్రత్త పడిన అమ్మడు..!

priya-varrier

ఒక్క చిన్న వీడియో టీజర్ తో కోట్ల హృదయాలను గెలిచిన మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ఒరు ఆదార్ లవ్ టీజర్ తో అంతర్జాలాన్ని స్థంభింపచేసిన సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజున ప్రియా చేసిన కనుసైగల్లో ప్రేక్షకులంతా ఇరుక్కున్నారు. ఇక ఆ సినిమా లో మాణిక్య మలయార పూవి సాంగ్ ముస్లీం ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని హైదరబాద్, మహారాష్ట్రలోని కొందరు యువకులు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.

అయితే వారికి ధీటుగానే ప్రియా వారియర్ ఇంకా ఒరు ఆదర్ లవ్ సినిమా డైరక్టర్ ఒమర్ లులు కూడా సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. తమపై క్రిమినల్ కేసు పెడతారని వార్తలు రాగానే కోర్టులో వీరు కూడా ఫిర్యాదు చేసి జాగ్రత్త పడ్డారు. ఇక ఒరు ఆదార్ లవ్ సినిమాకు ప్రియా వారియర్ స్పెషల్ క్రేజ్ తెచ్చి పెట్టింది.

ఈ ఒక్క సాంగ్ 17 మిలియన్ వ్యూస్ సంపాదించింది అంటే ఇక అమ్మడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ సీనియర్ స్టార్ రిషి కపూర్ సైతం ప్రియా వారియర్ కు పడిపోయారంటే ఇక ఆమె ఎంత స్పెషల్ అన్నది అర్ధం చేసుకొవచ్చు.

Leave a comment