బిగ్ బాస్ లో లైంగిక వేధింపులు.. కంటెస్టంట్ పై కేసు నమోదు..!

Case filed against bigg boss contestant

మీటూ అంటూ హీరోయిన్స్ ఇప్పటికే తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి బట్టబయలు చేస్తున్నారు. సరైన ఆధారాలు ఉంటే అలా చేసిన వారికి శిక్ష కూడా వేస్తున్నారు. ఇదిలాఉంటే కేవలం సినిమాల్లోనే కాదు టివి షోలో కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. బిగ్ బాస్ కన్నడలో లైంగిక వేధింపులు జరిగినట్టు కంటెస్టంట్ కవితా గౌడ పోలీస్ కేసు పెట్టారు. తన తోటి కంటెస్టంట్ యాండీ ఓ టాస్క్ లో భాగంగా తనని లైంగికంగా వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా రెండు రోజుల పాటు యాండీ తనని లైంగికంగా వేధించాడని ఆమె అంటుంది. అయితే ఈ విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. షో టైంలోనే ఈ వ్యవహారం తెలిసిన బిగ్ బాస్ కన్నడ నిర్మాత గురుదాస్ శణై షో బయటకు వెళ్లి మీరు మీరు తేల్చుకోండని చెప్పాడట. సూపర్ విలన్ టాస్క్ లో యాండీ తనని కావాలని లైంగికంగా వేధించాడని కవితా గౌడ పేర్కొంది. అయితే యాండీ మాత్రం అలాంటిదేమి జరుగలేదని కావాలంటే ఆ టాస్క్ మొత్తం చూడండని అంటున్నాడు. మరి ఇద్దరిలో ఎవరి వాదన నెగ్గుతుందో చూడాలి.

Leave a comment