లక్ష్మిపార్వతి-ఎన్టీఆర్… ఎంతవరకు సాధ్యం ?

lakshmis ntr

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ నుండి వస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్ లక్ష్మి పార్వతి మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో లక్ష్మి పార్వతిగా రోజా నటిస్తుందనే న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక మరోపక్క ఎన్.టి.ఆర్ రోల్ లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నటించే అవకాశాలున్నాయట.

వర్మ మాత్రం ఈ సినిమా అందరు అనుకున్నట్టుగా పొలిటికల్ సెటైర్ కాదని.. కేవలం ఎన్.టి.ఆర్ లక్ష్మి పార్వతి మధ్య జరిగే సంఘటనలే హైలెట్ అవుతాయని అన్నారు. సినిమా నిర్మిస్తున్న రాకేష్ రెడ్డి వై.సి.పి నేత అని కూడా తనకు తెలియదని అన్నారు. మొత్తానికి రోజాని లక్ష్మి పార్వతి చేస్తున్న వర్మ సినిమాతో ఎన్ని వివాదాలను సృష్టిస్తాడో చూడాలి.

Leave a comment