బాహుబలి రికార్డ్స్ కి ఎసరుపెట్టిన సాహో..

9

అంటే అవుననే అంటున్నారు..ప్రభాస్ ఫ్యాన్స్. ఈ రోజు రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే ప్రభాస్ లుక్ పరంగానే కాదు యాక్షన్ సీక్వెన్స్ లో ఇరగదీసినట్లు కనిపిస్తుంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో ఇప్పటివరకు ఎవరు చూపించని యాక్షన్ థ్రిల్లర్ ని సాహో చూపించబోతోందని ఓ క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు ఈ మూవీపై రక రకాల అంచనాలు నెలకొన్నాయి.. దర్శకుడు సుజిత్ ఈ సినిమా హ్యాండిల్ చేయలేక పోతున్నాడని..అంత బడ్జెట్ వర్క్ ఔట్ అవుతుందా? అని ఎన్నో అనుమానాలు తలెత్తాయి. మొత్తానికి సాహో టీజర్ కోసం అభిమానుల నిరీక్షణకు తెరపడింది.

కొన్ని గంటల క్రితమే సాహో టీజర్ ని చిత్ర యూనిట్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళీ భాషల్లో విడుదల చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు సాహో టీజర్ లోని యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, ప్రభాస్ స్టైల్ కు ఫిదా అవుతున్నారు. ఈ మూవీ కోసం కోసం ఏడుగురు ప్రముఖ యాక్షన్ కోరియేగ్రాఫర్స్ వర్క్ చేశారు. ఒక్కో యాక్షన్ సీన్ కు ఒక్కో స్టంట్ మాస్టర్ ను ఉపయోగించిన యూవీ క్రియేషన్స్ సుజీత్ విజువల్స్ కి ప్రాణం పోసిందని చెప్పవచ్చు.

ఎక్కువగా గన్స్ ఫైర్స్ – ఛేజ్ సీన్స్ ను వీరు డైరెక్ట్ చేశారు. ఇక కథ గురించి చిన్న క్లూ కూడా దొరకకుండా సుజీత్ టీజర్ ని చాలా పద్దతిగా ప్లాన్ చేశాడు. మాస్ ప్రేక్షకులని సంతృప్తి పరిచే విధంగా చివర్లో భీకరమైన బాడీ టూ బాడీ ఫైట్ సీన్ కూడా ఆకర్షిస్తోంది. మొత్తంగా నిర్మాతలు కేటాయించిన బడ్జెట్ కు న్యాయం చేస్తూ సుజీత్ సాహో చిత్రాన్ని తెరకెక్కించినట్లే ఉన్నాడు.

ఏదేమైనా దర్శకుడు సుజీత్ ఇంత పెద్ద సినిమాకు కెప్టెన్ గా ఉండి అనుభవం గల స్టార్ యాక్షన్ మాస్టర్స్ తో వర్క్ చేయించాడు అంటే నిజంగా అతనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి ఈ సినిమా జాతీయ స్థాయిలో దుమ్ము రేపిన బాహుబలి2 ని బీట్ చేస్తుందా..ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఆ స్థాయికి తీసుకు వెళ్తుందా లేదా అన్నది చూడాలి.

Leave a comment