Gossips2.o కు బాహుబలిని కొట్టే దమ్ముందా..?

2.o కు బాహుబలిని కొట్టే దమ్ముందా..?

శంకర్, రజిని కాంబినేషన్ లో వస్తున్న 2.ఓ సినిమా టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. వినాయక చవితి సందర్భంగా రిలీజైన టీజర్ రెండు రోజుల్లో 3 కోట్ల పైగా వ్యూయర్ కౌంట్ సాధించింది. ఇక ఈ సినిమా టీజర్ చూసిన ప్రేక్షకులు వారెవా అంటున్నారు. అయితే టీజర్ పై మిక్సెడ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
2
త్రీడీలో అయితే సూపర్ అనేలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని త్రీడి థియేటర్స్ ఉన్నాయన్నది హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి మొదటి రెండు పార్టులు 2డిలోనే వచ్చాయి. అయినా సరే అద్భుతాలు సృష్టించాయి. బాహుబలి రికార్డులను కొట్టే సత్తా 2.ఓకి ఉందనేలా కనిపిస్తున్నా ఈ సినిమా త్రీడీ ఫీల్ ఎంతమంది ఆస్వాధిస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
1
లైకా ప్రొడక్షన్స్ లో 550 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న 2.ఓ సినిమా టీజర్ అంచనాలను అందుకోగా నవంబర్లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news