” బుర్రకథ ” టీజర్.. ఇంట్రెస్ట్ స్టోరీతో ఆది సాయికుమార్..

42

సాయి కుమార్ తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సినిమాలైతే చేస్తున్నాడు కాని హీరోగా మాత్రం ఇంకా నిలబడలేదని చెప్పొచ్చు. తనవంతుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా వర్క్ అవుట్ కావట్లేదు. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా ఆది ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా ఆది చేస్తున్న మూవీ బుర్రకథ. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. టీజర్ చూశాక ఈసారి ఆది ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తున్నాడని చెప్పొచ్చు.

అదిరాం (అది సాయికుమార్) ఒకసారి ట్రెండీగా ఆలోచిస్తూ ఉంటాడు.. మరోసారి ఆధ్యాత్మికంగా మారుతాడు. ఒకమనిషిలో ఒక బుర్ర ఉంటేనే కష్టం అలాంటిది అభిరాం లో రెండు బుర్రలు ఉంటాయి. అదే ఈ బుర్రకథ సినిమా కాన్సెప్ట్. టీజర్ తో స్టోరీ చెప్పేసినా కావాల్సినంత కామెడీ సినిమాలో ఉంటుందని చెప్పకనే చెప్పారు. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎంతో కృషి చేస్తున్న ఆది సాయి కుమార్ కు ఈ సినిమా హిట్ కళ తెచ్చేలా ఉంది.

సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అభిమన్యు సింగ్ విలన్ గా నటిస్తున్నాడు. మిస్తి చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. చూస్తుంటే ఈసారి ఆదికి లక్ కలిసి వచ్చేలా ఉంది. కథ వెరైటీగా ఉంది.. కామెడీ కూడా అదిరిపోయేలా ఉంది మరి ఇంకేం కావాలి సినిమా ఆడియెన్స్ కు ఫుల్ ఎంటర్టైన్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇంకా రిలీజ్ డేట్ కన్ ఫాం అవ్వని ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

Leave a comment