మహేష్ బాటలో బన్ని.. బోల్తా కొడతాడా.. బీభత్సం సృష్టిస్తాడా..?

mahesh vs banni

సూపర్ స్టార్ మహేష్ తెలుగులో ఉన్న మార్కెట్ ఏంటో తెలిసిందే.. ఓవర్సీస్ లో కూడా సత్తా చాటుతున్న మహేష్ తమిళ మార్కెట్ మీద కన్నేశాడు. ఆలోచన రావడమే ఆలస్యం మురుగదాస్ తో స్పైడర్ చేశాడు. తెలుగులో ఆ సినిమా నిరాశ పరచినా సరే తమిళ ఆడియెన్స్ కు అది కనెక్ట్ అయ్యింది. అందుకే స్పైడర్ కోలీవుడ్ లో మంచి ప్రయత్నమే అంటున్నారు.

అయితే తెలుగు తమిళంలో చేసిన స్పైడర్ తో మహేష్ మరోసారి నాన్ బాహుబలి రికార్డులను తన పేరు మీద ఉండేలా ప్లాన్ చేశాడు కాని అది మాత్రం కుదరలేదు. ఇక మహేష్ దారిలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కోలీవుడ్ డైరక్టర్ లింగుసామితో సినిమా షురూ చేస్తున్నాడు. వచ్చే ఏదాడి మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందట.

కోలీవుడ్ లో మాస్ డైరక్టర్ గా క్రేజ్ ఉన్న లింగుసామి తెలుగు ఆడియెన్స్ కు నచ్చే సినిమా చేస్తాడా.. తెలుగు తమిళ బైలింగ్వల్ గా రాబోతున్న ఈ సినిమా స్పైడర్ లా కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బన్ని మహేష్ లా బోల్తా కొట్టకుండా బైలింగ్వల్ తో బీభత్సం సృష్టించాలని కోరుకుంటున్నారు మెగా అభిమానులు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.

 

Leave a comment