‘అరవింద సమేత’ బయ్యర్లకు అదిరిపోయే బంపర్ ఆఫర్

145

హారిక హాసిని క్రేఅషన్స్ అంటే సహజంగానే బయ్యర్ల కు చాలా నమ్మకం ఎక్కువ అందులోనూ త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాబింనేషన్ లో ఈ సినిమా రావడం వసూళ్ళ పరంగా రికార్డులు బద్దలుకొట్టడం బయ్యర్లకు ఈ బ్యానర్ మీద నమ్మకాన్ని పెంచుతోంది.

హారిక హాసిని సంస్థ మీద నమ్మకం అని మాత్రమే అనుకోవాల్సి వస్తోంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయితే, 20 పర్సంట్ చాంబర్ అగ్రిమెంట్ మేరకు కాస్త నష్టాలను ఆ సంస్థ పూడ్చింది. ఈ సారి కూడా బయ్యర్లకు అదే ధైర్యం కావచ్చు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఏమాత్రం బాగున్నా, ముఫై కోట్ల మేరకు వసూళ్లు వుంటాయి. సినిమా సూపర్ అయితే సమస్య లేదు. లేదూ తేడా వచ్చినా, ఆంధ్రలో ఓ నాలుగైదు కోట్లు వెనక్కు ఇచ్చేస్తుంది హారిక హాసిని అనే నమ్మకం. అందుకే బయ్యర్లు మారుమాట్లాడకుండా హారికహాసిని చెప్పిన రేట్లకు సినిమాలను కొనేస్తున్నారు.

ఇప్పటికే బయ్యర్లకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రతి జిల్లాలో జీఎస్టీని తామే కట్టేసింది. ఆ విధంగా బయ్యర్లకు కొంత భారం తప్పింది. దీనికితోడు ఎగస్ట్రా షో జీవో, రేటు పెంచుకునే జీవో తెప్పించారు. ఇన్ని చేసినా, ఫస్ట్ వీకెండ్ 4 రోజులకు 50 నుంచి 60 శాతం రికవరీనే వచ్చింది. మిగిలినది సరిగ్గా ఏడురోజుల్లో రావాలి. ఈ ఏడు రోజులలో అంటే 21తో దసరా సీజన్ ముగిసిపోతుంది. ఈ ఏడురోజుల్లో కూడా దాదాపు 70 నుంచి 80శాతం బయ్యర్లు గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది.

Leave a comment