Gossipsఎన్టీఆర్ హీరోయిన్‌ను ఏడిపించిన హీరో..

ఎన్టీఆర్ హీరోయిన్‌ను ఏడిపించిన హీరో..

మ‌ళ‌యాళ బ్యూటీ నివేద థామ‌స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె త‌న టాలెంట్‌తో త‌క్కువ సినిమాల‌కే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసేసింది. నిన్నుకోరి – జెంటిల్ మేన్ – జై లవకుశ – 118 చిత్రాలతో మంచి విజ‌యాలు సొంతం చేసుకుంది. అందాన్ని మించిన అభిన‌యం ఆమె సొంతం. నిన్నుకోరి, జై ల‌వ‌కుశ లాంటి సినిమాల్లో ఆమె చేసిన యాక్టింగ్ సూప‌ర్బ్‌.

ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాలో ఆమె ఎన్టీఆర్‌తో పోటీప‌డి మ‌రీ న‌టించ‌డంతో పాటు డ్యాన్స్ కూడా చేసింది. న‌ట‌నా ప‌రంగా ఇలా ఉంటే నివేద బెస్ట్ క్లాసిక్ డ్యాన్స‌ర్‌. ఆమె డ్యాన్స్‌లో ర‌ప్ఫాడిస్తుంద‌ట‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన సినిమాల్లో ఆమె డ్యాన్స్ ప‌రంగా త‌న టాలెంట్ ఫ్రూవ్ చేసుకునే అవ‌కాశం రాలేదట‌. ఇప్పుడు శ్రీవిష్ణుతో ఆమె చేస్తోన్న బ్రోచేవారెవరురా సినిమాలో ఆమె డ్యాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని హీరో శ్రీ విష్ణుయే స్వ‌యంగా క‌న్‌ఫార్మ్ చేశాడు.

నివేద‌లోని డ్యాన్సింగ్ స్కిల్స్‌కు తాను ప‌డిపోయానంటోన్న విష్ణు క‌థాప‌రంగా ఈ సినిమాలో డ్యాన్సులు ఎక్కువుగా చేయాలి ? ఎవ‌రు చేస్తార‌న్న ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు త‌మ మ‌దిలో నివేదానే మెదిలింద‌న్నాడు. నిన్ను కోరి సినిమాలో ఆమె డ్యాన్సులు చూశాం అని.. అందుకే ఆమెను ఎంపిక చేసుకున్నామ‌న్నాడు. ఇక నివేద 20 రోజుల పాటు డ్యాన్సింగ్ క్లాసుల‌కు వెళ్లి మ‌రీ ప్రాక్టీస్ చేసింద‌ట‌.

ఈ క్ర‌మంలోనే ఆమె ఎలా డ్యాన్స్ చేస్తుందో ద‌ర్శ‌కుడితో క‌లిసి శ్రీవిష్ణు చూసేందుకు వెళ్లాడ‌ట‌. కిటికీలో నుంచి ఎగిరి మ‌రీ ఆమె డ్యాన్సులు చూశాడ‌ట‌. పొట్టోళ్లు గట్టోళ్లు అని అంటారు కదా…అలా నివేదా చాలా కష్టపడి డ్యాన్సులు నేర్చుకుంది. ఒకరోజు నేను కిటికీ నుంచి చూశాను. ఎగిరెగిరి డ్యాన్సులు చేసింద‌ని స‌ర‌దాగా ఆమెను అట ప‌ట్టించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news