Gossipsబాలయ్య మీద ఫైర్ అవుతున్న బ్రహ్మానందం..!

బాలయ్య మీద ఫైర్ అవుతున్న బ్రహ్మానందం..!

మూలిగే నక్క మీద గుమ్మడికాయ పడ్డట్టు ఈమధ్య పూర్తిగా ఫాం కోల్పోయిన బ్రహ్మానందంకు నట సింహం నందమూరి బాలకృష్ణ 102వ సినిమా జై సింహాలో ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చారని తెలిసింది. బ్రహ్మానందం కం బ్యాక్ సినిమాగా జై సిం హా ఇదవుతుందని అంటున్నారు. అయితే షూట్ కంప్లీట్ చేసుకుని డబ్బింగ్ కు వెళ్లిన బ్రహ్మానందం కు షాక్ తగిలిందట.

దాదాపు సీన్స్ అన్ని కట్ చేశారని బ్రహ్మి దర్శకుడు కె.ఎస్ రవికుమార్ మీద ఫైర్ అయ్యాడట. అంతేకాదు ఈ విషయాన్ని బాలయ్య దగ్గర కూడా ప్రస్థావించినట్టు తెలుస్తుంది. బ్రహ్మి సీన్స్ కోతపై చాలా కోపం మీద ఉన్నాడని తెలుస్తుంది. అయితే కేవలం నిడివి ఎక్కువైందన్న కారణం చేతనే సినిమాలో ఆ సీన్స్ కట్ చేసినట్టు తెలుస్తున్నా బ్రహ్మానంద రొటీన్ కామెడీ సినిమాను మళ్లీ వేరే ట్రాక్ లో తీసుకెళ్తుందని ట్రిం చేశారని అంటున్నారు.

ఫైనల్ గా బ్రహ్మిని శాంతపరచినా సరే జై సింహా యూనిట్ పై బ్రహ్మానంద మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నాడని తెలుస్తుంది. జనవరి 12న రిలీజ్ అవుతున్న జై సింహా సినిమాలో నయనతార, హరిప్రియ, నటాషా ధోషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news