మళ్ళీ మెగా హీరోతోనే బోయపాటి ?

Boyapati Srinu

జయ జానకి నాయక  సినిమా తో వరస హిట్స్ సాధించిన  బోయపాటి శ్రీను  తర్వాత  ఎవరితో సినిమాను చేస్తున్నాడు. మొన్నటివరకు చిరంజీవితో ఒక సినిమా ని తీయాలని ఈ యాక్షన్ డైరెక్టర్ అనుకున్నారు. ఇంతలోనే ఆయన తన 151 వ చిత్రం సైరా ను స్టార్ట్ చేసేసారు మెగా స్టార్. అయితే ఇప్పుడు బోయపాటి సినిమా ఎవరితో అనే టాపిక్ సర్వత్రా ఉత్కంఠగా మారింది .

ఆ మధ్య బాలయ్య తో ఒక సినిమా అనుకున్నారు బోయపాటి . బాలయ్య కెరీర్ లోనే అత్యంత సూపర్ హిట్స్ ను అందించారు బోయపాటి . సో కచ్చితంగా ఆయనతో ఒక సినిమా చేస్తారు బాలయ్య అనుకున్నారంతా . కానీ బాలయ్య తన ఫండ మార్చడంతో బోయపాటిని పక్కన పెట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి . మహేష్ , రాంచరణ్ లు కూడా బోయపాటి లిస్ట్ లో వున్నారు . అయితే మహేష్ పిచ్చ బిజీ గ ఉండడంతో రామ్ చరణ్ కు ఒక  కథ వినిపించారట బోయపాటి . అది విన్న రాంచరణ్ ఆ కథను ఒకే చెయ్యటం కూడా జరిగిందట .

మొన్నటివరకు ధృవ, ఇప్పుడు రంగస్థలం.. రెండూ కూడానూ కాస్త డిఫరెంట్ జోనర్ సినిమాలే. అందుకే మధ్యలో ఒక మాస్ సినిమా పడితే ఆ లెక్క వేరేగా ఉంటుందని చరణ్‌ ఫీలయ్యాడట.  పైగా సరైనోడు రిజల్ట్ చూశాక.. చరణ్‌ కూడా బన్నీ తరహాలో ఒక మాస్ హిట్ కోసం ఉవ్విళ్ళూరుతున్నాడని టాక్. అందుకే ఇప్పుడు బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటాడని అంటున్నారు. అఫీషియల్ ప్రకటన ఏమన్నా ఇస్తారేమో చూద్దాం.

Leave a comment