Gossipsచరణ్ కొత్త రికార్డ్స్ షురూ .. రంగస్థలం సినిమా కాదు

చరణ్ కొత్త రికార్డ్స్ షురూ .. రంగస్థలం సినిమా కాదు

టాలీవుడ్ లో ఉన్న ఊర మాస్ డైరక్టర్స్ లో బోయపాటి ఒకరు. హీరోల ఇమేజ్ వారి ఫ్యాన్స్ అంచనాలను సాటిస్ఫై చేసేలా బోయపాటి శ్రీను సినిమాలు ఉంటాయి. రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయకా సినిమాతో సత్తా చాటిన బోయపాటి తన తర్వాత సినిమాను మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం సుకుమార్ తో రంగస్థలం 1985 సినిమా చేస్తున్న చరణ్ ఆ తర్వాత బోయపాటితోనే సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. ఇక ఈ కాంబినేషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా కోసం చరణ్ బాడీ షేప్ ను మార్చుకోబోతున్నాడట. కండలు తిరిగే దేహంతో కనిపించేలా వర్క్ అవుట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట.

రంగస్థలం పూర్తి కాగానే బోయపాటి సినిమా మీద దృష్టి పెట్టనున్నాడు చరణ్. కచ్చితంగా ఈ కాంబినేషన్ రికార్డులు షురూ చేయడం పక్కా అంటున్నారు మెగా అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news