బోయపాటికి చుక్కలు చూపిస్తున్న బాలయ్య !

41

ఒక సినిమా హిట్ అయితే ఆ క్రేజే వేరు. అందులో పనిచేసిన హీరో , హీరోయిన్, డైరెక్టర్ ఇలా ఒకటేంటి అందరిమీద ప్రశంసలు వర్షం కురుస్తుంది. అదే కనుక ప్లాప్ టాక్ తెచ్చుకుందంటే ఇక అందరూ దూరం పెట్టినట్టుగా వ్యవ్యహరిస్తారు. ఇది ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో సర్వ సాధారణం.

భారీ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను పరిస్థితి కూడా ఈ విధంగానే తలకిందులైంది. ఇప్పటికే ఎన్నో ఎన్నెన్నో… భారీ హిట్ చిత్రాలు నిర్మించి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి… బాలకృష్ణ కు ఎన్నో హిట్లు అందించాడు. అయితే మొన్నీ మధ్య రిలీజ్ అయిన వినయవిధేయ రామ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలి పోవడంతో డిస్ట్రబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. ఈ సినిమా అపజయాన్ని అంగీకరిస్తూ రామ్ చరణ్ కుడా అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేక కూడా విడుదల చేశారు.

దీంతో బోయపాటికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ టాప్ డైరెక్టర్ తో సినిమా తీయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసిన వారంతా ఇప్పడు ఒకసారి వెనక్కి తగ్గారు. అయితే ఈ విషయంలో మాత్రం బాలయ్య అండగా నిలిచాడు. కానీ…. బాలయ్య కొత్త కొత్త కండిషన్లు పెడుతుండడంతో బోయపాటి షాక్ కి గురవుతున్నారట. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సుమారు 70 కోట్ల బడ్జెట్ వార్తలు రావడంతో బోయపాటి బాలయ్య పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చాడట.

అంత భారీ బడ్జెట్ అయితే లేనిపోని సమస్యలు వస్తాయని అందుకే ఆ బడ్జెట్ను 50 కోట్లకు తగ్గించాలంటూ సూచించాడట. అసలే చెప్పింది బాలయ్య కావడంతో ఈ విషయంలో ఏమి చేయాలి బోయపాటి అవుతున్నాడట. ఎందుకంటే బోయపాటి సినిమా అంటేనే ‘భారీ’ అని ఊహించుకునే ప్రేక్షకులు సాధారణంగా సినిమా తీసేస్తే ఒప్పుకుంటారా లేదా అనే సందేహాం ప్రస్తుతం బోయపాటిలో కనిపిస్తోంది.

Leave a comment