Gossipsబోయపాటి - చెర్రి సినిమా రీమేకా ..?

బోయపాటి – చెర్రి సినిమా రీమేకా ..?

రామ్ చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి అందరికి తెలిసిన సంగతే. . జ‌న‌వ‌రి 19 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమా ద‌స‌రాకి వెండి తెర మీద వేలగాబోతోంది. అయితే .. ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ ‘ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ ప‌యో’కి రీమేక్ అని వార్త‌లు వస్తున్నాయి.

స‌ల్మాన్ ఖాన్‌, సోన‌మ్ క‌పూర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ చిత్రం తెలుగులోనూ ‘ప్రేమ‌లీల’ పేరుతో అనువాద‌మ‌య్యింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే…. ఈ తెలుగు అనువాదంలో స‌ల్మాన్ పాత్ర‌కి చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్ప‌డం. ఆల్రెడీ డ‌బ్బింగ్ అయిన సినిమాని రామ్ చ‌ర‌ణ్ రీమేక్ చేస్తాడా? అది కూడా త‌ను డ‌బ్బింగ్ కూడా చెప్పిన సినిమా తాలుకూ రీమేక్‌లో అంటే ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మే. మ‌రి.. ఈ రీమేక్ వార్తల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. అన్న‌ట్టు.. చ‌ర‌ణ్ ఇందులో ద్విపాత్రాభినయం చేయ‌నున్నాడ‌ని వార్తలు కూడా వస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news