రంగస్థలం కాదు అంతకుమించేలా చరణ్ సినిమా..!

boyapati-ram-chara-movie-details

రంగస్థలం సినిమాతో కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను హీరోయిన్ కైరా అద్వాని చరణ్ కు జోడీగా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్ మసాలాతో నిండి ఉంటుందని తెలిసిందే. స్టార్ ఇమేజ్ ను రెండితలు చేసేలా ఊర మాస్ సినిమాలను తీయడంలో బోయపాటి శ్రీను తర్వాతే ఎవరైనా.. రాం చరణ్ తో చేస్తున్న ఈ సినిమా కూడా పక్కా మాస్ తో వస్తుందని తెలుస్తుంది. కళ్లుచెదిరే యాక్షన్స్ సీక్వన్సెస్ తో ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుందని అంటున్నారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 15 రోజుల పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే యూరప్ లో రెండు సాంగ్స్ షూట్ చేస్తారట. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబేరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ ప్రశాంత్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.

Leave a comment