Gossipsప్రముఖ బాలీవుడ్ సిని నటి మృతి..!

ప్రముఖ బాలీవుడ్ సిని నటి మృతి..!

ఈమధ్య సినిమా పరిశ్రమలో అనారోగ్యంతో బాధపడుతూ మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువైంది. దీర్ఘకాళిక వ్యాధులతో బాధపడుతున్న కొందరు హాస్పిటల్స్ లోనే వారి జీవితాన్ని ముగించేస్తున్నారు. శ్రీదేవి మరణం నుండి ఇంకా బాలీవుడ్ తేరుకోకముందే ప్రముఖ బాలీవుడ్ నటి సుజాతా కుమార్ మృతి అందరిని షాక్ అయ్యేలా చేసింది.

నటిగా ఎన్నో బాలీవుడ్ సినిమాలు చేసిన సుజాతా కుమార్ తెలుగు సినిమాల్లో కూడా నటించారు. లెజెండ్ లో బాలకృష్ణ బామ్మ పాత్రలో నటించిన సుజాతా కుమార్ శ్రీదేవి రీ ఎంట్రీ మూవీ ఇంగ్లీష్ వింగ్లీష్ లో ఆమె స్నేహితురాలి పాత్రలో నటించింది. కొన్నాళ్లుగా కాన్సర్ తో పోరాటం చేస్తున్న సుజాతా కుమార్ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారట. ఈ విషయాన్ని సుజతా కుమార్ సోదరి సుచిత్రా కృష్ణమూర్తి వెళ్లడించారు. ఈరోజు ఉదయం సుజాతా కుమార్ అంత్యక్రియలు జరిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news