Moviesబిగ్‌బాస్‌ విన్నర్‌కు ఇది అసలు పరీక్ష

బిగ్‌బాస్‌ విన్నర్‌కు ఇది అసలు పరీక్ష

బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచిన శివబాలాజీకి మంచి క్రేజ్‌ దక్కింది. ఇన్నాళ్లు పలు చిత్రాల్లో నటించినా కూడా రాని క్రేజ్‌ బిగ్‌బాస్‌తో ఒక్కసారిగా వచ్చింది. తనకు వచ్చిన క్రేజ్‌ను వినియోగించుకునేందుకు శివబాలాజీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తాను హీరోగా నటించి స్వయంగా నిర్మించిన సినిమా స్నేహమేరా జీవితం రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో సహాయనటుడిగా నటించి మెప్పించిన శివబాలాజీకి మంచి బ్రేక్‌ మాత్రం రాలేదు. హీరోగా చాలా కాలం తర్వాత ఈ చిత్రాన్ని చేశాడు.

రాజీవ్‌ కనకాలతో కలిసి శివబాలాజీ చేసిన ఈ సినిమా ఫలితంపై అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు ప్రేక్షకుల ముందుకు దాదాపు 8 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ 8 సినిమాల్లో స్నేహమేరా జీవితం సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల కాబోతుంది. శివబాలాజీకి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపించి, ఈ చిత్రాన్ని ఎక్కువ రేటుకు కొనుగోలు చేయడం జరిగింది.

అన్ని ఏరియాల్లో కూడా మిగిలిన సినిమాలో పోల్చితే ఎక్కువ థియేటర్లలో విడుదల కాబోతుంది. రేపు విడుదల కాబోతున్న సినిమాలన్నింటిలో ఈ చిత్రంపైనే ఎక్కువ దృష్టి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో, అంచనాల నడుమ విడుదలవుతున్న స్నేహమేరా జీవితం ఎలా ఉంటుందో చూడాలి. ఇది శివబాలాజీకి మరో పెద్ద పరీక్ష అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news