బిగ్ బాస్-2 కంగుతినిపిస్తున్న కౌశల్ ఓట్లు..!

51

బిగ్ బాస్ 2 మొదలైన నాటి నుండి ఇంట్లో వారి మీద ఓ కన్నేసి ఉంచండని నాని చెప్పిన మాటలని శిరసా వషిస్తూ బిగ్ బాస్ 2ని సూపర్ హిట్ చేశారు తెలుగు ప్రేక్షకులు. నాని హోస్ట్ గా వస్తున్న ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేసులో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో కౌశల్ కే ఎక్కువ సపోర్ట్ ఉంది అన్న విషయం అందరికి తెలిసిందే.

అంతా ఇంతా కాదు ఇంటి సభ్యుకతో ఏకంగా 10 లక్షల ఓట్లు తేడాతో కౌశల్ ఓటింగ్ కొనసాగుతుందట. ఇప్పటికే కౌశల్ తరపున చాలామంది ఓట్లు వేస్తుండగా ఓ అన్ అఫిషియల్ సైట్ వెళ్లడించిన ఓట్ల ప్రకారం కౌశల్ 1.46 మిలియన్ ఓట్లు సాధించాడు అంటే 14 లక్షల పైనే అన్నమాట. ఆ తర్వాత 4 లక్షల ఓట్లు సాధించింది దీప్తి నల్లమోతు.

అంటే కౌశల్ తో మిగతా ఇంటి సభ్యులకు దాదాపు 10 లక్షల వ్యత్యాసం ఉంది. చూస్తుంటే టైటిల్ విన్నర్ కౌశలే అని బల్ల గుద్ది చెప్పేలా పరిస్థితి కనబడుతుంది. కౌశల్ ఆర్మీ సపోర్ట్ తో కౌశల్ బిగ్ బాస్ 2 విన్నర్ గా నిలుస్తున్నాడని ఇప్పటికే కొంతమంది ఎనౌన్స్ చేసేస్తున్నారు.

Leave a comment