బిగ్ బాస్ సీజన్-2 కంటెస్టంట్స్ వీళ్లే.. ఈసారి మాత్రం క్రేజీ స్టార్స్..!

bigboss-season-telugu-2

బిగ్ బాస్ సీజన్ 1 ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. స్టార్ మా తెలుగులో ఇదవరకు ఎన్నడు లేనివిధంగా రియాలిటీ షోలో సరికొత్త అనుభూతిని పంచేలా బిగ్ బాస్ షోని తీసుకొచ్చింది. హిందిలో సూపర్ హిట్ అయిన ఈ షోని తెలుగులో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసింది. సీజన్ 1 బుల్లితెరని షేక్ ఆడించేయడంతో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-2కి సిద్ధం అవుతుంది.

ఈ సీజన్ కు ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయడం కుదరని తెలియడంతో రేసులో నాచురల్ స్టార్ నాని వచ్చాడు. దాదాపు నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్-2 కన్ఫాం అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. హోస్ట్ ఎలా ఉన్నా బిగ్ బాస్ సీజన్-2లో ఈసారి పాటిస్పేట్ చేసే కంటెస్టంట్స్ ని ఫైనల్ చేశారట.

ఈసారి క్రేజీ సెలబ్రిటీస్ ను ఈ షో కోసం సెలెక్ట్ చేశారట. అందులో ఒకప్పటి లవర్ బోయ్ తరుణ్, సింగర్ గీతా మాధురి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి, తేజశ్వి మడివాడా, గజాలా, యాంకర్ శ్యామలా ఉన్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టంట్స్ సగం మంది కొత్తవారే కాని ఈసారి అందరిని సెలెబ్రిటీస్ ను సెలెక్ట్ చేశారట. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 1 కన్నా ఈ సీజన్ లో రూల్స్ ఇంకా కష్టంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది.

Leave a comment