Gossipsసీజన్-2 కంటెస్టంట్స్ లిస్ట్.. బిగ్ బాస్ ఈసారి రచ్చ రచ్చే..!

సీజన్-2 కంటెస్టంట్స్ లిస్ట్.. బిగ్ బాస్ ఈసారి రచ్చ రచ్చే..!

బిగ్ బాస్ సీజన్ వన్ సక్సెస్ అవడంతో రెండో సీజన్ షురూ చేశారు. తెలుగులో రియాలిటీ షోలో కొత్త అనుభూతిని అందించిన ఈ షోని స్టార్ మా చాలా ప్రెస్టిజియస్ గా తీసుకుంది. ఇక మొదటి సీజన్ తారక్ హోస్ట్ గా చేయగా సెకండ్ సీజన్ లో నాని బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నాడు. ఇక ఈ సీజన్ లో మసాలా కావాల్సినంత ఉంటుందని ప్రోమోతోనే చెప్పారు.

ఇక 16 మంది కంటెస్టంట్స్ లో రెగ్యులర్ గా వార్తల్లో ఉండే వాళ్లు కూడా ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్స్ గా వస్తున్నారట. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం శ్రీ రెడ్డి కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఇక ఆమెతో పాటుగా రాశి, ఛార్మి, గజాల, యాంకర్ లాస్య, శ్యామలా, సింగర్ గీతా మాధురి, ధన్య బాలకృష్ణ, శ్రీదేవి, చాందిని చౌదరి, తరుణ్, వరుణ్ సందేష్, తనీష్, ఆర్యన్ రాజేష్ లు ఈసారి బిగ్ బాస్ కంటెస్టంట్స్ గా ఉంటారట. ఈసారి సరికొత్తగా ఆడియెన్స్ లో ఒకరు కూడా బిగ్ బాస్ హౌజ్ కు వెళ్లే అవకాశం ఉందట.

ఆడియెన్స్ లో ఎవరన్నది మాత్రం ఆరోజే తెలుస్తుంది. మరి బయటకు వచ్చిన ఈ లిస్ట్ నిజమా కాదా అన్నది తెలియాలంటే జూన్ 10 వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news