బిగ్ బాస్-2 లో అప్పుడే గ్రూప్ రాజకీయాలు..!

big-boss-group-politics

స్టార్ మా ప్రెస్టిజియస్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో సెకండ్ సీజన్ మొదలైంది. నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో 16 మంది కంటెస్టంట్స్ హౌజ్ లో ఉన్నారు. అందులో ముగ్గురు కామన్ మెన్ కాగా.. ఒకరు మానవతావాది బాబు గోగినేని. ఈ నలుగురు కాకుండా మిగతా వారంతా ఏదో ఒక విధంగా సినిమా పరిశ్రమకు సంబందించిన వారే.

హౌజ్ లో మొదటిరోజే ఈ హౌజ్ కు ఎవరు అనర్హులని హౌజ్ మెంబర్స్ కు ఫిటింగ్ పెట్టిన బిగ్ బాస్.. సంజన, నూతన్ నాయుడులను జైలులో పెట్టారు. ఇక ఓ రోజు ఆగాక నూతన్ నాయుడు బయటకు వచ్చాడు. తానో కామన్ మ్యాన్ అని కావాలని వీరంతా కక్ష్య కడుతున్నారని అప్పుడే పాలిటిక్స్ మొదలుపెట్టింది సంజన.

కచ్చితంగా ఆమె వల్ల ఈ 16 మంది సభ్యులు రెండు గ్రూపులుగా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక మొదటి నామినేషన్ ప్రక్రియలో దీప్తి సునైనా, గణేష్, కిరీటి, కౌశల్, సంజన, నూతన్ నాయుడు ఉన్నారు. వీరిలో మొదటి వారం ఎవరు ఈ హౌజ్ నుండి నిష్క్రమిస్తారో చూడాలి.

Leave a comment