బిగ్ బాస్ హౌస్ లో ఊహించని సర్ ప్రైజ్

big boss new entry

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ ప్రి రిలీజ్ బిజినెస్‌తో పాటు భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోంది జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో ఈ సినిమాకు రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఈ నెల 21న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.

ఐతే ఎన్టీఆర్ హోస్ట్ గా వున్నా బిగ్ బాస్ షో లోకి  ఇద్దరు హీరోయిన్ లు అతిధులుగా రానున్నారు. సినిమా ప్రమోషన్ కోసం ఎంతోమంది నటులు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. అదే బాటలో జై లవ కుశ హీరోయిన్లు రాశి కన్నా నివేద థామస్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నారు.శనివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు సందడి  చేస్తారు.శనివారం ఎన్టీఆర్ కూడా వుంటారు కాబట్టి  రాశి కన్నా నివేద థామస్ బిగ్ బాస్ హౌస్ లో కి వెళ్లడానికి ఆంగికరించినట్లు తెలిసింది.

Leave a comment