బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ … పూర్తి వివరాలు చుస్తే ఫ్యాన్స్ కి పూనకాలే !!

bigboss2-news

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో సంచలనాలు సృష్టించిన రియాలిటీ షో బిగ్ బాస్. మొదటి సీజన్ అంచనాలను మించి ప్రేక్షక ఆదరణ పొందిన ఈ షో సెకండ్ సీజన్ కు రంగం సిద్ధం అవుతుంది. సెకండ్ సీజన్ కు యంగ్ టైగర్ హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. జూన్ నుండి ఈ సెకండ్ సీజన్ మొదలు కానుందట.

ఇక ఈ షో 14 వారాల పాటు సాగుతుందట. సెలబ్రిటీస్, కాంట్రవర్సీలు ఎక్కువగా ఉన్న వారిని ఈ సీజన్ లో తీసుక్నున్నారని టాక్. బిగ్ బాస్ సీజన్ వన్ ఓ అనుభవం తీసుకొచ్చింది కాబట్టి సీజన్-2లో పాటిస్పేట్ చేసేందుకు సెలబ్రిటీస్ కూడా ఉత్సాహం చూపిస్తున్నారట. ఇక మార్చు నుండి త్రివిక్రం సినిమా మొదలవనుంది.

లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 1లో జై లవ కుశను ప్రమోట్ చేసుకున్న తారక్.. ఇప్పుడు త్రివిక్రం సినిమాను సీజన్-2లో ప్రమోట్ చేస్తారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఈసారి షో మరింత ఉత్సాహంగా ఉండనుందని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్-2 ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈసారి ఈ సెట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది.

Leave a comment