బిగ్ బాస్ సీజన్ – 2 ఎప్పుడు ? కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా ?

Jr NTR In Bigg Boss Show First Look ULTRA HD Photos Posters WallPapers

యంగ్ టైగెర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ ను ప్రజల మనసుల్లోకి వెళ్లి మంచి విజయం సాధించింది. 70 రోజులు ఈ షో ని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ప్రధానంగా ఈ బిగ్ బాస్ మొదటి సీజన్ ను ఎన్టీఆర్ నడిపించిన విధానం అద్భుతం అని చెప్పొచ్చు. మొదటి సీజన్ విన్నర్ గా శివ బాలాజీ నిలిచారు . అయితే తెలుగు బిగ్ బాస్ మీద మొదట్లో పెద్దగా అంచనాలు లేవు.అందుకే ఈ షో పాల్గొనడానికి చాల మంది సెలబ్రిటీస్ ఆలోచించి వెనక్కి తిరిగారు. మొదటి సిజన్ తర్వాత బిగ్ బాస్ స్థాయి ఏంటో సినీ తారలకు అర్ధం అయింది. అందుకే ఇప్పుడూ వాళ్లు కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి హౌస్ లో ఉండేందుకు ముందుకు వస్తున్నారు. మొదటి సీజన్ మంచి సక్సెస్ సాధించడంతో.. రెండో సీజన్ మొదలు పెట్టేందుకు బిగ్ బాస్ యూనిట్ ఆలోచనలో ఉంది. బిగ్ బాస్ 2 ఏప్రిల్ లో మొదలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆరు నెలల ముందే బిగ్ బాస్ రెండో సీజన్ కోసం వారి డేట్లు తీసుకోవడం వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఈలోపు ఎవరైన వేరే కాల్ షీట్స్ తో బిజీగ ఉన్న రెండో సీజన్ వరకు కంప్లీట్ చేసుకోని.. హౌస్ లోకి ఎంట్రీ ఇవచ్చు అని ప్లాన్ చేస్తున్నారట. అయితే అప్పుడే ఈ బిగ్ బాస్ యాజమన్యం కొందరి స్టార్స్ ని సంప్రాదించారట. వారు కూడా దాదాపు ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వారు అగ్రిమెంట్ కూడా చేసుకోనున్నారు. మరి సీజన్ 2 లో పార్టిసిపెంట్స్ చేసే స్టార్ ఎవరంటే..
.. హీరోయిన్ ఛార్మి
.. జై లవ కుశ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసిన ధన్య బాలకృష్ణ
.. హీరో తనీష్
.. హీరోయిన్ గజాల
.. ప్రముఖ సింగర్ గీతామాధురి
.. హీరో వరుణ్ సందేశ్
.. వైవా హర్ష
.. యాంకర్ లాస్య
.. షార్ట్ పిల్మ్స్ తో పాటు.. కొన్ని సినిమాలో హీరోయిన్ గా నటించిన ఛాందిని చౌదరి
.. హీరో తరుణ్
.. యాంకర్ ఓంకార్
.. హీరో ఆర్యన్ రాజేష్
.. నిన్నటి తరం హీరోయిన్ శ్రీదేవి
.. కమెడియన్ వేణు మాధవన్

 

Leave a comment