బిగ్ బాస్ సీజన్-2 కి ఎన్టీఆర్ నో.. కారణం తెలిస్తే షాకే

big boss season-2

టాలీవుడ్ లో యంగ్ టైగర్ క్రేజ్  రోజు రోజుకీ పెరిగిపోతూ ఉంది…వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ తన సహచర హీరోలకు  గట్టి పోటీ ఇస్తూ తన రేంజ్ ను నిలుపుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరించి. ఫర్స్ట్ సీసన్ ను  బ్రహ్మాండంగా ముగించిన ఎన్టీఆర్…రెండో సీసన్ లో కూడా ఈ షో ని హోస్ట్ చేస్తాడా లేదా? అన్న సందేహం అందరిలో ఉంది…అయితే ఈ షో ని హోస్ట్ చెయ్యడానికి ఎన్టీఆర్ కి కుదరదు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది…దానికి గల కారణాలు ఏంటి అంటే…ఎన్టీఆర్ ఈ షో హోస్ట్ చెయ్యకపోవడం వెనుక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హస్తం ఉందని తెలుస్తుంది….

ఎన్టీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం త్రివిక్రమ్ తో చేయబోతున్న మూవీ అని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. దీనితో ‘బిగ్‌ బాస్ 2’ హోస్ట్ చేయడం ద్వారా ఎన్టీఆర్ లుక్ ప్రేక్షకులకు ముందే తెలిసిపోతుంది అనే  భయం త్రివిక్రమ్ కు ఉంది అని టాక్.  అంతేకాకుండా ఈ చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకోవడానికి ఎన్టీఆర్  విదేశాలకు కూడా వెళ్తున్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో త్రివిక్రమ్ సినిమా ఎన్టీఆర్‌ కు ఒక కొత్త ప్రయోగం లాంటిది అని అంటున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందే ఈ సినిమా కోసం పూర్థిస్థాయి సమయాన్ని కేటాయించాలని జూనియర్ భావిస్తున్న నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 2 లో ఎన్టీఆర్ చేయడం అనుమానమే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

Leave a comment