బిగ్ బాస్-2 పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసా..!

big-boss-2-public-response

బిగ్ బాస్ సీజన్ మొదలవగానే కొత్త ఉత్సాహం మొదలైంది. ఎన్.టి.ఆర్ కు ఏమాత్రం తగ్గకుండా నాని కూడా హోస్టింగ్ టాలెంట్ చూపించేస్తాడని అంచనా వేసిన ఆడియెన్స్ అతన్ని హోస్ట్ గా బాగానే రిసీవ్ చేసుకున్నారు. బిగ్ బాస్-2 నాని ఎపిసోడ్ తో పాటుగా కంటెస్టంట్స్ ఎపిసోడ్ ఒకటి పూర్తయింది.

దీనిపై పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే అందరు షాక్ అవుతున్నారు. పబ్లిక్ టాక్ లో ఎన్.టి.ఆర్ కు ఈక్వల్ గా నాని యాంకరింగ్ ఉంటుందని చెబుతున్నారు. అయితే మొదటి (కర్టైన్ రైజర్) ఎపిసోడ్ కాబట్టి నాని టాలెంట్ అంతగా బయటపడలేదు. రానున్న రోజుల్లో నాని బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తారని అంటున్నారు.

ఇక ఇప్పుడు వచ్చిన కంటెస్టంట్స్ లో కామన్ మెన్ గా ముగ్గురిని పెట్టారు. వారిని ఎందుకు పెట్టారో అని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి నాని హోస్ట్ చేస్తున్న ఈ బిగ్ బాస్ సెకండ్ సీజన్ మునుముందు ఎలా ఉండబోతుందో చూడాలి.

Leave a comment