ఆ బిగ్ బాస్ లేడీ భర్తకు విడాకులు…

BB

ప్ర‌ముఖ బాలీవుడ్‌ నటి బాబీ డార్లింగ్‌.. భర్త రామ్మీన్‌ శర్మ నుంచి విడాకుల కోరుతూ కోర్టును ఆశ్రయించింది. బాబీ డార్లింగ్ గురించి తెలియ‌ని వారు ఉండ‌రు. లింగమార్పిడితో బ్యూటీగా మారిన ఆమె 23 ఏళ్ల వయసులో గే మ్యాన్ గా 18 పాత్రలు పోషించి ఆమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు ద‌క్కించుకుంది. బిగ్ బాస్ షో దెబ్బ‌తో ఆమె దేశ‌వ్యాప్తంగా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యారు.

ఇదిలా ఉంటే ఆమె త‌న భ‌ర్త వేధింపుల‌పై తాజాగా వార్త‌ల్లోకి ఎక్కారు. తన భర్త రామ్మీన్ శర్మ తనను తీవ్రంగా వేధిస్తున్నాడని.. తనకు విడాకులు ఇప్పించాలని కోరింది ఈ ఢిల్లీ భామ. త‌న‌ను త‌న భ‌ర్త నిత్యం హింసించ‌డం, వేధింపుల‌కు గురి చేయ‌డంతో పాటు తీవ్రంగా అనుమానిస్తున్నాడ‌ని ఆమె వాపోయింది.

తాగి వ‌చ్చి కొట్ట‌డంతో పాటు ఇత‌రుల‌తో అక్ర‌మ సంబంధాలు పెట్టుకుంటున్నాన‌ని అనుమానిస్తున్నాడ‌ని కూడా ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొంది. అలాగే త‌న‌ను అస‌హ‌జ శృంగారం చేయాల‌ని కూడా ఒత్తిడి చేస్తున్నాడ‌ని, త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బుల‌న్ని లాగేసుకోవ‌డంతో పాటు  త‌న‌పై ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల‌తో నిఘా ఉంచుతున్నాడ‌ని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

తాను పరస్పర సమ్మతితో విడాకులు తీసుకోవాలని తాను సూచించినా వినకుండా వేధిస్తున్నాడని తెలిపింది. భర్త నుంచి తన ఆస్తి తనకు ఇప్పిస్తే.. వాటన్నింటినీ అమ్మేసి తిరిగి ముంబైకి వచ్చి నివసిస్తానని ఆమె తెలిపింది.

sex-nati

Leave a comment