బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ బ్యూటీ.. నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..!

nadhini-nreddy-details

బిగ్ బాస్ ఎవరి అంచనాలకు అందడు.. ఇది నిజమని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నాని హోస్ట్ గా స్టార్ మాలో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2లో మొదటి ఎలిమినేషన్ గా సంజనా హౌజ్ నుండి బయటకు వచ్చింది. నూతన్ నాయుడు, సంజనాలలో ఒకరు బయటకు వెళ్లాల్సి ఉండగా ఆడియెన్స్ పోల్ లో నూతన్ నాయుడు సేఫ్ అయ్యాడు.

ఇక సంజనా అలా వెళ్లిందో లేదో మరో కొత్త కంటెస్టంట్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నందిని రాయ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఈమె రోజు చూసే ఎన్నో యాడ్స్ లో కనిపించే మోడల్ కమ్ యాక్ట్రెస్. నేషనల్ వైడ్ గా 80కి పైగా ప్రొడక్ట్స్ బ్రాండింగ్ చేస్తుందట. చూడగానే ఆమెని కొందరు గుర్తుపట్టగా మరికొందరు మళ్లీ కామన్ మెన్ కే ఛాన్స్ ఇచ్చారా అనుకున్నారు.

కాని బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చింది నందిని రాయ్.. హీరోయిన్ గా కూడా ఆమె తెలుగు, తమిళ భాషల్లో చేస్తుంది. మోడల్ గా ఎంతో క్రేజ్ సంపాదించిన ఈమె 2008లో మిస్ హైదరాబాద్, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ ఫైనల్ విన్నర్ అయ్యింది. హైదరాబాద్ లో చదుకున్న నందిని లండన్ లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుంది. ఫైనల్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్-2లో తెలుగు అమ్మాయిగా కంటెస్టంట్స్ లో ఒకరిగా వచ్చింది. మొదటి వారమే ఆమె హౌజ్ లో జాయిన్ అవ్వాల్సి ఉన్నా ఆమె ముఖం మీద ఇంజ్యూరీ వల్ల రాలేకపోయిందట. సంజనా వచ్చాక 15 మంది ఉన్న బిగ్ బాస్ హౌజ్ లో మళ్లీ నందిని రాకతో 16 మంది అయ్యారు.

Leave a comment