Gossipsబిగ్ బాస్-2 వైల్డ్ కార్డ్ ఎంట్రీగా టాప్ హీరోయిన్..!

బిగ్ బాస్-2 వైల్డ్ కార్డ్ ఎంట్రీగా టాప్ హీరోయిన్..!

నాని హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 2 మొదలై వారం రోజులు కావొస్తుంది. మొదటి వారం అనుకున్నంత బాగా లేకున్నా హౌజ్ లో కంటెస్టంట్స్ వారి స్వభావాలు అర్ధమయ్యాయి. ఇక ఈ సీజన్ హౌన్ లో మొదటి కెప్టెన్ గా సామ్రాట్ ఎంపికయ్యాడు. సంజనా, గణేష్, భాను శ్రీలతో పాటుగా సామ్రాట్ కెప్టెన్ గా పోటీ చేయగా ఫైనల్ గా సామ్రాట్ కే అందరు ఓటేశారు.

ఇక ఈ సీజన్ లో కామన్ మెన్ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. వారిలో సంజనా సెలబ్రిటీస్ కు సైతం మంచి పోటీ ఇస్తుంది. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎవరు వస్తారు అన్న దాని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ సీజన్ లో దీక్షా పంథ్ హౌజ్ లో ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌజ్ ను వేడేక్కించేసింది. ఇక ఇప్పుడు అదే క్రమంలో ఓ క్రేజీ హీరోయిన్ బిగ్ బాస్ హౌజ్ లో ఎంట్రీ ఇస్తుందట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రగ్యా జైశ్వాల్ అని అంటున్నారు. కంచె సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ఈ అమ్మడు అరకొర అవకాశాలతోనే కెరియర్ సాగిస్తుంది. మరి బిగ్ బాస్-2 లో ప్రగ్యా ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.

hot-hd-wallpapers-of-Pragya-Jaiswal

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news