Gossipsరాం గోపాల్ వర్మ " భైరవ గీత " రివ్యూ &...

రాం గోపాల్ వర్మ ” భైరవ గీత ” రివ్యూ & రేటింగ్

వర్మ ఫ్యాక్టరీ నుండి వస్తున్న భైరవ గీత సినిమా సిద్ధార్థ్ డైరక్షన్ చేశాడు. ధనుంజయ్, ఇర్రా మోర్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వర్మ మార్క్ పబ్లిసిటీ భారీ రేంజ్ లో జరిగిన ఈ సినిమా ఎలా ఉందో ఎనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

సహచరులను కుక్కలకన్నా హీనంగా చూసే సుబ్బారెడ్డి దగ్గర పనిచేస్తుంటాడు భైరవ (ధనుంజయ్). తన కూతురు గీత (ఇర్రా మోర్)ను తనకంటూ అన్నిట్లో ఎక్కువగా ఉన్న కట్టారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. కాని గీత భైరవని ప్రేమిస్తుంది. భైరవ గీతలు ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలిసిన సుబ్బారెడ్డి. భైరవ తల్లిని, స్నేహితులను చంపేస్తాడు. విషయం తెలుసుకున్న భైరవ సుబ్బారెడ్డి మీద ఎలా పగ తీర్చుకున్నాడు అన్నది సినిమా కథ.
2
నటీనటుల ప్రతిభ :

ధనుంజయ్ తను చేసి భైరవ పాత్రలో అదరగొట్టాడు. ఆ పాత్రకు తను పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఇక ఇర్రా మోర్ కూడా అందం, అభినయం రెండిని బ్యాలెన్స్ చేస్తూ నటించింది. సుబ్బారెడ్డి, కట్టా రెడ్డి పాత్రలు ఆకట్టుకున్నాయి. సినిమాలో అందరు వారి పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. 91 కాలం నాటి పరిస్థితులను చూపించారు. సినిమాలో ఎక్కువ మార్కులు కెమెరా మెన్ కు పడతాయి. ఇక దర్శకుడు కథ అంతగా గొప్పగా రాసుకోలేదు. అందుకే కథనం కూడా పెద్దగా మెప్పించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ అక్కడక్కడ బాగున్నాయి.
1
విశ్లేషణ :

రొటీన్ కథను అంతే రొటీన్ స్క్రీన్ ప్లేతో భైరవ గీత అని తీశడు సిద్ధార్థ్. సినిమాలో వర్మ మార్క్ హిం స కనిపిస్తుంది. కథ కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది. అయితే సిద్ధార్థ్ టేకింగ్ కొన్ని చోట్ల మెప్పిస్తుంది. సినిమాలో కొత్తగా చెప్పుకోడానికి ఏమి ఉండదు. రొటీన్ రివెంజ్ డ్రామాగా భైరవ గీత వచ్చింది.

ఈ సినిమాలో లీడ్ పెయిర్ రొమాన్స్ కాస్త ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే వారి ప్రేమకు బలమైన సన్నివేశాలు కూడా రాసుకోలేదు. రొమాన్స్ మాత్రం దిట్టంగా పెట్టారు. ఒక సాంగ్ లో హీరోయిన్ మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టేసింది. ఈ సినిమా కొత్త దర్శకుడు కాబట్టి కాస్త కూస్తో ఫ్రెష్ గా అనిపించింది. అయితే వర్మ డైరెక్ట్ చేసి ఉంటే మాత్రం తేడా కొట్టేది.

ప్లస్ పాయింట్స్ : టేకింగ్

లీడ్ పెయిర్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ : రొటీన్ స్టోరీ

వయిలెన్స్

మ్యూజిక్

బాటం లైన్ : రెగ్యులర్ రాయలసీమ కథతో భైరవగీత..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news