భరత్ అనే నేను 25 డేస్ కలక్షన్స్.. అసలు లెక్క ఇదే..!

bharath-ane-nenu-25-days-co

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భరత్ అనే నేను. స్టైలిష్ సిఎంగా మహేష్ తన సత్తా చాటిన సినిమా ఇది. సిఎంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటే ప్రజల కష్టాలు తీరుతాయో అలాంటి కథతో వచ్చాడు మహేష్. బ్రహ్మోత్సవం, స్పైడర్ తర్వాత మహేష్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇక సినిమా నిర్మాత 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు అని పొస్టర్స్ వేసినా సినిమా అసలు కలెక్ట్ చేసింది ఎంత అంటే ఇప్పటివరకు 93.17 కోట్లు మాత్రమే. ఈ 93 కోట్లు షేర్ వాల్యూ అని తెలుస్తుంది. 99 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన భరత్ అనే నేను 93 కోట్లను వసూళు చేయడం విశేషం.

ఇంకా సినిమా హిట్ అనిపించుకోవాలంటే మరో 6 కోట్లు తీసుకురావాల్సిందే. ఇక ఏరియాల వారిగా భరత్ అనే నేను కలక్షన్స్ వివరాలు చూస్తే..

నైజాం : 18.60 కోట్లు

సీడెడ్ : 9.75 కోట్లు

ఉత్తరాంధ్ర : 8.61 కోట్లు

గుంటూర్ : 8.25 కోట్లు

ఈస్ట్ : 6.80 కోట్లు

వెస్ట్ : 4.22 కోట్లు

కృష్ణా : 5.04 కోట్లు

నెల్లూరు : 2.60 కోట్లు

ఏపి/ తెలంగాణా టోటల్ కలక్షన్స్ : 63.87 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 10.70 కోట్లు

ఓవర్సీస్ : 18.60 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ కలక్షన్స్ : 93.17 కోట్లు

Leave a comment