బాక్సాఫీస్ పై మహేష్ ఊచకోత..! రెండు రోజులే ఎక్కువ..

bharat-anu-nenu-collections
మహేష్ సినిమా హిట్టు కొడితే ఆ లెక్క ఎలా ఉంటుందో రుచి చూపిస్తుంది లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యువ ముఖ్యమంత్రిగా మహేష్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల తర్వాత మహేష్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది.
రిలీజ్ అయిన మొదటి షో నుండి హిట్ టాక్ సొంతం చేసుకున్న భరత్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. శ్రీమంతుడు తర్వాత మహేష్ కొరటాల శివ కాంబోలో వచ్చిన ఈ సినిమా మంచి కథ కథనాలతో వచ్చింది. ఇక ఈ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ తో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా యూఎస్ లో ప్రీమియర్స్ తోనే.. మిలియన్ డాలర్లను వసూళు చేసింది.
ఇప్పటివరకు 2.5 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన భరత్ చూస్తుంటే బాహుబలి 1 సినిమా రికార్డును యూఎస్ లో క్రాస్ చేసేలా ఉంది. భరత్ అనే నేను మరోసారి మహేష్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుంది.

Leave a comment