ఆ ఫంక్షన్ కోసం పెట్టె ఖర్చు తెలిస్తే జనానికి చుక్కలే

bharat-ane-nunu-audio-details

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు ఏ రేంజ్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 20న రిలీజ్ ప్లాన్ చేశారు.

సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో త్వరలో రిలీజ్ చేస్తారట. వైజాగ్ లో రిలీజ్ చేయనున్న ఈ సినిమా ఆడియో కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో హీరో సిఎం కాబట్టి సినిమా ఆడియో కూడా అసెంబ్లీ సెట్ లో రిలీజ్ చేస్తారట. దీని కోసం కోటి దాకా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది.

అంతేకాదు డిఎస్పి లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని తెలుస్తుంది. టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన భరత్ అనే నేను సినిమా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ కలక్షన్స్ సాధిస్తుందో చూడాలి. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపుల తర్వాత వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.

Leave a comment