బాలయ్య వార్నింగ్.. హైపర్ ఆది రెస్పాన్స్ ఇది..!

Balayya warning to hyper adhi?

జబర్దస్త్ షోతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆది ఓ స్కిట్ లో బాలకృష్ణను ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. అయితే అప్పట్లో బాలయ్య అతనికి వార్నింగ్ ఇచ్చాడని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లకు బాలకృష్ణ వార్నింగ్ ఎపిసోడ్ మీద నోరు విప్పడు హైపర్ ఆది. అసలు తనకు బాలకృష్ణ నుండి ఎలాంటి వార్నింగ్ రాలేదని.. యూట్యూబ్ ఛానెల్స్ వారి వ్యూస్ కోసం ఇలా చేశారని అన్నాడు. కేవలం వ్యూస్ కోసం ఎలాంటి వార్తలైనా వారు రాస్తారని అంటున్నాడు హైపర్ ఆది.

ప్రస్తుతం జబర్దస్త్ తో పాటుగా సినిమాల్లో కూడా అరకొర అవకాశాలతో కెరియర్ సాగిస్తున్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్ జనసేన తరపున ప్రచారంలో కూడా పాల్గొంటున్నాడు. పవన్ అంటే అమితమైన అభిమానం ఉన్న హైపర్ ఆది పవన్ మీటింగులలో పాల్గొంటున్నాడు. ఓ పక్క కెరియర్ తో పాటుగా రాజకీయాల్లో కూడా కీలకంగా మారాలని చూస్తున్నాడు హైపర్ ఆది. అయితే ఫ్యూచర్ లో అతను కూడా పొలిటిషియన్ గా మారుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

తన పంచులతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న హైపర్ ఆది ఈమధ్య కాంటవర్షియల్ కామెంట్స్ తో అందరికి కంటవుతున్నాడు. బాలయ్య అయితే వార్నింగ్ ఇవ్వలేదు కాని బాలకృష్ణ ఫ్యాన్ ఒకరు తన టీం కు ఫోన్ చేశారని చెప్పాడు. అయితే తనకు మాత్రం ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని చెప్పుకొచ్చాడు ఆది.

Leave a comment