ఎన్టీఆర్ బయోపిక్ తో నాగ్ బాలయ్య ల మధ్య మరో చిచ్చు..

11

బాలకృష్ణ హీరోగా ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతుంది. బాలయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ఏయన్నార్ గా నాగ చైతన్య నటిస్తాడని కొన్నాళ్లు వార్తలు రాగా చైతు కాదు సుమంత్ ఏయన్నార్ గా కనిపిస్తాడని అన్నారు. కొద్దిరోజులుగా బాలకృష్ణ, నాగార్జున ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు.

ఒకే స్టేజ్ మీద ఇద్దరు కలిసి చాలా రోజులవుతుంది. అయితే ఏయన్నార్ గా తన ఫ్యామిలీ హీరోలెవరు చేయొద్దని నాగార్జున చెప్పే ఆలోచనలో ఉన్నాడట. అందుకే ఎన్.టి.ఆర్ బయోపిక్ లో అసలు ఏయన్నార్ రోల్ లేకుండా చేస్తున్నారట. క్రిష్ ఇదవరకు రెండు మూడు సీన్స్ రాయగా అది కూడా వద్దనేశాడట బాలకృష్ణ. మరి చూస్తుంటే నాగ్ పై కోపంతోనే ఏయన్నార్ పాత్రని తొలగించారని తెలుస్తుంది. మరి వీరి మధ్య ఈ దూరం మరింత పెరిగేలా ఉంది తప్ప దగ్గరయ్యే ఆలోచన ఇప్పుడప్పుడే లేదు.

Leave a comment