వివేక్ ఏ హీరో అభిమానో తెలిస్తే షాకే..!

vivek
కొన్నాళ్లుగా పవన్ ఫ్యాన్స్ వర్సెస్స్ కత్తి మహేష్ మాటల యుద్ధం శృతిమించిపోయింది. తనకు పవన్ ఫ్యాన్ వల్ల ఇబ్బంది ఉందన్న మహేష్ దాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక నిన్న పవన్ కు సపోర్ట్ ఇచ్చిందని పూనం కౌర్ ను ఈ రొచ్చులోకి లాగాడు కత్తి. నిన్న మొత్తం ఇదే న్యూస్ హల్ చల్ చేయగా ఫైనల్ గా నిన్న సాయంత్రం కత్తికి కౌంటర్ ఇచ్చి అతన్ని స్టూడియో నుండి వెళ్లిపోయేలా మాట్లాడాడు డైరక్టర్ వివేక్.
కత్తి మహేష్ కు కౌంటర్ వేస్తూ తన తల్లి గురించి ఓ రెండు నిమిషాలు మాట్లాడమన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై అక్కడ కత్తి వెనక్కి తగ్గాడు. కత్తికి మొదటిసారి కరెక్ట్ పంచ్ పడిందన్న భావన కలిగింది. అయితే అసలు ఎవరు ఈ వివేక్ అంటే అతను దర్శకుడు రచయిత మాత్రమే కాదు బాలయ్య అభిమాని అని తెలుస్తుంది.
అతను ఇంటర్వ్యూలో వెళ్లడించిన విషయం గుర్తించి ఓ బాలయ్య అభిమానిగా కాకుండా పవన్ కోసం కత్తి మహేష్ పై గూబ అదిరే పంచ్ వేశాడు వివేక్. మొదట కత్తి పవన్ పై చేస్తున్న కామెంట్స్ కొంతవరకు వాస్తవమని అనిపించినా అతను శృతిమించిన తీరు చూస్తే తప్పకుండా ఇదేదో రాజకీయ కుట్రలానే అనిపిస్తుంది.

Leave a comment