బాలయ్య-బోయపాటి సినిమా ముహూర్తం ఖరారు..!

balakrishna movie details

మూస సినిమాలతో అసలేమాత్రం ఫాంలో లేని బాలయ్యతో సింహా అంటూ సూపర్ హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. ఆ సినిమాతో మళ్లీ బాలకృష్ణ హిట్ ట్రాక్ ఎక్కేశారు. ఆ తర్వాత లెజెండ్ అంటూ మరో హిట్ సినిమా ఈ కాంబినేషన్ లో వచ్చింది. మళ్లీ బాలకృష్ణ 100వ సినిమా బోయపాటి డైరక్షన్ లో వస్తుందని అనుకోగా అది ఎందుకో కుదరలేదు.

ఇక ఇప్పుడు మరోసారి బోయపాటి డైరక్షన్ లో బాలకృష్ణ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ అక్టోబర్ కల్లా పూర్తి చేసి నవంబర్ నుండి బోయపాటి సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. సింహా, లెజెండ్ తర్వాత రాబోతున్న ఈ క్రేజీ మూవీపై చాలా అంచనాలున్నాయి. మరి ఈసారి బాలకృష్ణను బోయపాటి ఎలా చూపిస్తాడో చూడాలి. ప్రస్తుతం బోయపాటి కూడా రాం చరణ్ తో సినిమా చేస్తున్నాడు. అది కూడా అక్టోబర్ లో షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తుంది.

Leave a comment