పుట్టినరోజున విశ్వరూపం చూపించిన బాలయ్య..!

balayya-birthday-function-details

నందమూరి నటసింహం బాలకృష్ణకు కాస్త కోపం ఎక్కువని తెలిసిందే. పైకి సరదాగా కనిపిస్తున్నా లోపల మాత్రం చాలా సీరియస్ గా ఉంటారు బాలయ్య. ఇక పబ్లిక్ లో ఎవరైనా తనని ఇబ్బంది పెడితే మాత్రం ఇక వారి చెంప చెళ్లుమనిపిస్తాడు. అయితే ఇందతా ఒకసైడే తన వల్ల తన అభిమానులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి బాలకృష్ణ తనలో మార్పు తెచ్చుకున్నాడట.

రీసెంట్ గా జూన్ 10న తన పుట్టినరోజు జరుపుకున్న బాలకృష్ణ.. ఆరోజు తనని విష్ చేసేందుకు వచ్చిన ప్రతి ఫ్యాన్స్ తో సెల్ఫీ దిగి వారిని సంతోష పెట్టాడట. తాను అనుకుంటే ఏదైనా చేయగలనని మరోసారి ప్రూవ్ చేశాడు బాలయ్య బాబు. ఇక ప్రస్తుతం క్రిష్ డైరక్షన్ లో చేస్తున్న ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

ఎన్.బి.కే ఫిలింస్ బ్యానర్ లో బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో విద్యాబాలన్ తో పాటుగా టాలీవుడ్ లో కొందరు నటీనటులు స్క్రీన్ షేర్ చేసుకుంటారని తెలుస్తుంది.

Leave a comment