Gossipsపృధ్విని చెంప చెళ్లుమనిపించిన బాలయ్య..!

పృధ్విని చెంప చెళ్లుమనిపించిన బాలయ్య..!

30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో సూపర్ పాపులర్ అయిన పృధ్వి రాజ్ తను ఇచ్చే ప్రతి ప్రైవేట్ ఇంటర్వ్యూలో ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటారు. రీసెంట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ గురించి ప్రస్థావించిన పృధ్వి తనకు మా అధ్యక్షుడిగా పోటీ చేసే ఆలోచన లేదని.. అయితే ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటారో వారికి నా సపోర్ట్ ఉంటుందని అన్నారు.

అయితే ఒకసారి మా అధ్యక్షుడిగా ఉన్న వారి మళ్లీ పోటీ చేస్తే మాత్రం తాను సపోర్ట్ చేయనని చెప్పాడు. ఇక రాష్ట్ర రాజకీయాల గురించి కూడా పృధ్వి తనదైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లెజెండ్ సినిమాలో ఓ డైలాగ్ కూడా గుర్తుచేశారు. పార్టీ మారే నేతల గురించి లెజెండ్ లో బాలకృష్ణకు తనకు మధ్య ఓ డైలాగ్ ఉంటుందని గుర్తు చేశారు.

బాలయ్య తనతో నీ తల్లి వయసెంత అంటే 74 ఏళ్లు అని చెప్పగా.. తల్లిని మార్చేస్తావా అని అడుగుతాడని.. అదేంటండి అమ్మనెలా మారుస్తామని అనగా.. మరి అమ్మలాంటి పార్టీనెలా మారుస్తావ్ రా అని చెంప దెబ్బ కొడతారని అన్నాడు. అలాంటి లీడర్ కావాలని తరచూ పాటీ మార్చే వాళ్లను బాలయ్య కొట్టినట్టు చెంపదెబ్బలు వాయించాలని అన్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందని చెప్పిన పృధ్వి రాజ్ ఒకే పార్టీలో కొనసాగుతా అని అన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news