ఆ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ రెడీ…

balayya

టాలీవుడ్‌లో నందమూరి హీరో ఎంతో ఫేమస్. అభిమానులతో పాటు హీరోలు, డైరెక్టర్లు కూడా జై బాలయ్య అంటుంటారు. అప్పట్లో బాలయ్య నటించిన నరసింహనాయుడు సినిమా తెలుగు సినిమా ఇండ్రస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అందులో బాలయ్య డైలాగులు, యాక్షన్ చూస్తే మతిపోవాల్సిందే. ఆ సినిమాలో డైలాగులు ఇప్పటికీ అభిమానుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే మోత మోగించడానికి సిద్దమైయిపోతున్నాడు బాలయ్య బాబు.

నరసింహనాయుడు సినిమాకి త్వరలో సీక్వెల్ రాబోతుంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘జై సింహా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జై సింహా తర్వాత బాలయ్య చేయబోయే సినిమా గురించి అప్పుడే రకరకాల వార్తలు బయటకి వస్చేస్తున్నాయి. అందులో భాగంగానే ‘నరసింహనాయుడు’ సినిమాకి సీక్వెల్ రాబోతోందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇటీవలే రచయిత చిన్ని కృష్ణ ‘నరసింహనాయుడు’ సీక్వెల్ స్క్రిప్టు పనులని పూర్తి చేశాడు. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్లి శరవేగంగా షూటింగ్ పూర్తి చెయ్యాలని భావిస్తున్నారు. ఐతే, ఈ సినిమాకు దర్శకుడు ఎవరు ? ఏ బ్యానర్ లో తెరకెక్కనుంది ? బాలయ్య సరసన నటించే హీరోయిన్స్ ఎవరు ?? అనేది మాత్రం బయటకి పొక్కనీయడంలేదు. సో త్వరలోనే నరసింహనాయుడు ఉగ్ర రూపం అభిమానులకు కనువిందు చేయబోతోందన్నమాట

Leave a comment