Gossipsసక్సెస్ మీట్ కి బాలయ్య రావటానికి అసలు కారణం..?

సక్సెస్ మీట్ కి బాలయ్య రావటానికి అసలు కారణం..?

నందమూరి బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య కొన్నాళ్లుగా దూరం అందరికి తెలిసిందే. వారిని కలపాలని కొంతమంది ప్రయత్నించినా లాభం లేదని ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. హరికృష్ణ ఆకస్మిక మరణం వారిని ఒకటి చేసింది. అన్న మరణంతో బాలకృష్ణ, తండ్రి మరణంతో ఎన్.టి.ఆర్ ఇద్దరు మాటలు కలిపారు.

కరెక్ట్ టైంలో అబ్బాయ్ లకు తన సపోర్ట్ అందించాడు బాలయ్య. ఇక ఈ సందర్భంగా అరవింద సమేత సక్సెస్ మీట్ లో బాలయ్యను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. చిత్రయూనిట్ కోరిక మేరకు బాలకృష్ణ సక్సెస్ మీట్ కు అటెండ్ అయ్యారు. అయితే ఎప్పటిలానే మైక్ అందుకుని జోష్ ఫుల్ గా మాట్లాడిన బాలకృష్ణ అసలు మాట్లాడాల్సిన ఎన్.టి.ఆర్ గురించి మాట్లాడటం మానేశాడు.

తను మాత్రమే చెప్పగలిగే పద్యాలు.. సూక్తులతో 20 నిమిషాల పాటు మాట్లాడిన బాలయ్య ఎన్.టి.ఆర్ ప్రస్థావన తీసుకురాలేదు. మాటవరసకి ఇలాంటి పాత్రలు చేయాలంటే అది మా వంశమే అన్నాడు తప్ప పర్టిక్యులర్ గా ఎన్.టి.ఆర్ గురించి మాట్లాడలేదు. కేవలం ఫ్యాన్స్ కోసమే బాలకృష్ణ ఎన్.టి.ఆర్ సినిమా వేడుకకు వచ్చాడని అంటున్నారు. ఎన్.టి.ఆర్ మాత్రం తండ్రి హోదాలో వచ్చిన బాబాయ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news