Gossipsబాలయ్యతో సూపర్ స్టార్ మల్టీస్టారర్.. కాంబో సెట్ అయితే రికార్డులు బద్ధలే..!

బాలయ్యతో సూపర్ స్టార్ మల్టీస్టారర్.. కాంబో సెట్ అయితే రికార్డులు బద్ధలే..!

నందమూరి బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ ఈ ఇద్దరి స్టామినా గురించి సినిమాల రికార్డుల గురించి అందరికి తెలిసిందే. ఇక ఈ ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తే.. అబ్బో ఇక రికార్డులు బద్ధలవడం ఖాయమే. ఇంతకీ ఈ ఇద్దరిని హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరు అంటే ఇంకెవరు బోయపాటి శ్రీనునే అంటున్నారు. బాలయ్యతో సింహా, లెజెండ్ సినిమాలు తీసిన బోయపాటి తనతో హ్యాట్రిక్ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

జయ జానకి నాయకా తర్వాత ఏ సినిమా కమిట్ అవ్వని బోయపాటి శ్రీను బాలయ్య, మహేష్ లను కలిపి ఓ మల్టీస్టారర్ కథ రాసుకున్నాడట. ఒకవేళ అది బాగుంటే కనుక ఇద్దరు సినిమా చేసే అవకాశాలున్నాయి. బాలయ్య 102వ సినిమాలో బిజీగా ఉండగా మహేష్ భరత్ అను నేను షూట్ లో ఉన్నాడు.

అది పూర్తి కాకముందే వంశీ పైడిపల్లి సినిమా షురూ చేస్తున్నాడు. మరి ఇలాంటి టైంలో మహేష్ మల్టిస్టారర్ అంటే కష్టమే అని చెప్పాలి. బాలయ్య మహేష్ మల్టీస్టారర్ సినిమాలకే కొత్త ఉత్సాహం తెచ్చే ఈ కాంబో సెట్ అయితే ప్రతి సినిమా అభిమానికి పండుగే అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news